నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తా : చంద్రబాబు
నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తురు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కుప్పం నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పని ఒత్తిడి వల్ల నియోజకవర్గానికి రాలేకపోయినా తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపిస్తున్నారని అన్నారు. కులాలు, మతాల పేరుతో కొందరు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో రూ.230 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 14 ఎకరాల 50 సెంట్లను మార్కెట్ కమిటీకి ఇస్తామన్నారు. అన్ని కార్యకలాపాలు ఇక్కడి నంచే కొనసాగుతాయని, పంటలతోపాటు పట్టు పరిశ్రమ, డెయిరీకి ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. ఇళ్లల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. పేదల పిల్లల చదువుల కోసం సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల మంజూరుకు ఎవరైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేయాలని, అవినీతికి ఎవరైనా పాల్పడితే 1100 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ అని, పార్టీ ప్రతిష్టతను కాపాడుకోవాలని పేర్కొన్నారు.













