ఏడు ఎకరాల్లో 150 కోట్ల తో శ్రీవారి ఆలయ నిర్మాణం : చంద్రబాబు
జనవరి 31 గురువారం ఉదయం అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం మరియు బీజావాపనం. జనవరి 31వ తేదీ గౌ|| రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు భూకర్షణం మరియు బీజావాపనంను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. టిటిడి తిరుపతి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , ఆలయ చైర్మన్ పుట్టా సుధాకర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు హాజరయ్యారు.
వెంకటయపాలెం ఉదయం 9.15 నుండి 9.40 గంటల వరకు మీన లగ్నంలో శ్రీవారి నూతన ఆలయ ప్రదేశమున భూకర్షణ, బీజావాపన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఉదయం 5 నుండి 6 గంటల వరకు చతుర్వేద పారాయణం, ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు యాగశాల కార్యక్రమాలు, యుగళాంగల హల సహిత వృషభపూజ నిర్వహించారు.
తదనంతరం మహాపూర్ణాహుతి, వేదాశీర్వచనం చేపడతారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం వైభవంగా జరుగనుంది. ఏడు ఎకరాల్లో 150 కోట్ల తో ఆలయాన్ని నిర్మాణం చేపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన ఆగమ స్థాన చార్యులు మోహనరంగా చార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రెండు సంవత్సరాలలో వెంకటాయపాలెం లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
యాగశాల నుంచి నాగలి తో తరలి వెళ్లిన ముఖ్యమంత్రి. శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న ప్రాంతంలో రెండు జోడేద్దు లతో దక్కిన అనంతరం భూకర్షణం , బీజావాపనం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, పరిటాల సునీత, తదితరులు. మరో రెండు సంవత్సరాలలో వెంకటాయపాలెం లో శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తి చేస్తారు. స్వామి వారి ఉత్స విగ్రహాలకు నక్షత్ర హారతి, కుప్ప హారతి, మహా హారతి లను అందచేశారు.
వెంకటయపాలెం నిర్మించనున్న శ్రీవారి నూతన ఆలయ కేటాయించిన 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తాము. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేకుండా ఉచితంగా టిటిడి పేర రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
రాజధాని వెంకటపాలెం లో నిర్మిస్తున్న శ్రీ వారి ఆలయ నిర్మాణానికి రూ 1,11,116 విరాళం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందజేదిన శ్రీ మేకల బాబు.
అమరావతి రాజధాని ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం
ఆగమశాస్త్ర ప్రకారం భూకర్షణం, బీజావాపనం కోసం ప్రత్యేక పూజలు – శాస్త్రోక్తంగా గోపూజ, కలశ పూజ నిర్వహించిన తితిదే వేదపండితులు – తిరులమ పెద్దజీయ్యంగర్ ఆధ్వర్యంలో కైంకర్యాలు – భూకర్షణ ప్రాంతంలో గోవు, కలశంతో ప్రదక్షిణ – కార్యక్రమంలో పాల్గొన్న తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ – కార్యక్రమంలో పాల్గొన్న జేఈవో, దుర్గగుడి ఛైర్మన్ గౌరంగబాబు – 6 హోమగుండాలతో యాగశాలలో కొనసాగుతున్న మహాయాగం – మధ్య వేదికపై కుంభంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆవాహన – ముక్కోటి దేవతల ఆశీర్వాదం కోసం బీజావాపనం – మీనా లగ్నంలో భూకర్షణం, బీజావాపనం .













