Chandrababu: వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యోదంతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వీరయ్య చౌదరి (Veeraiah Chowdhury) భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని, 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నేను ఢల్లీి (Delhi) లో ఉన్నప్పుడు ఈ వార్త తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. ఈ హత్య జరిగిన విధానం చూస్తే కరడుగట్టిన నేరస్థులు సైతం చేయని రీతిలో ఉంది. భౌతికకాయంపై 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా? అనిపిస్తోంది. వీరయ్య చౌదరి మంచి నాయకుడు. సమర్థమంతమైన వ్యక్తి. యువగళం సందర్భంలో 100 రోజుల పాటు లోకేశ్ (Lokesh) తో తిరిగారు. అమరావతి (Amaravati) రైతుల పాదయాత్ర సమయంలో అండగా నిలబడ్డారు. పార్టీకి ఒక సమర్థమైన వ్యక్తిగా పనిచేశారు. ఈ మండలంలో 10 వేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితులో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మంచి నేతను కోల్పోవడం బాధాకరం అన్నారు.













