తిరుపతి నుంచి సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.టీడీపీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అదే రోజు శ్రీకాకుళంలో, 17న విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో పర్యటన ఉంటుందన్నారు. రెండో దశలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. తర్వాతి దశలో కర్నూలు, కడప, అనంతపురంలో పర్యటన ఉంటుందని అన్నారు. 15 నుంచి సేవామిత్రలు, బూత్ కన్వీనర్లతో జిల్లా సభలు నిర్వహించాలని, సంక్షేమ పథకాల లబ్దిదారులంతా టీడీపీకే మద్దతు ప్రకటించేలా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నడూ లేనంతగా పకడ్బందీగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుపుతున్నామన్నారు.













