ఆంధ్రులది ఒకే మాట.. ఒకే బాట
ఐదు కోట్ల ఆంధ్రులది ఒకే మాట, ఒకే బాట. రాష్ట్రాభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుంటే వదిలిపెట్టేది లేదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. సచివాలయం నుంచి సాధికార మిత్రులతో ఆయన మాట్లాడారు. ఒక విజ్ఞప్తి చేస్తున్నా. పాలకుల తప్పులకు ప్రజలను బలి చేయవద్దు. దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా పైకి వచ్చే వరకు కేంద్రం సహాయం చేయాలని కోరుతున్నాం. మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరముంది. అలా ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కొందరు కేవలం ఒక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారే తప్ప అనేక విషయాలను మరుగుపరుస్తున్నారు అని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చాలి. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే వదిలిపెట్టం. కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉంటాం. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ను చిత్తు చేశారని, ఆంధ్రుల కసి ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు. 29 పర్యాయాలు ఢిల్లీ వెళ్లాను. ప్రధానిని, కేంద్ర మత్రులను కలిశాను. అయినా, తగిన న్యాయం జరగలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.













