ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : చంద్రబాబు
రాష్ట్రవిభజన తర్వాత కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన ఏక పక్షంగా జరిగిందన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పెద్దలు విభజన హామీ సమయంలో ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, రాష్ట్రానికి పదేళ్లపాటు హోదా డిమాండ్ చేసిన బీజేపీ కేంద్ర పెద్దలకు ప్రత్యేకహోదా గుర్తు లేదా అని ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు, అంశాలను బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు కావాల్సిన నిధులు, రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పునరావాస కల్పనకు నిధులు ఇవ్వాలని, రెవెన్యూ లోటు భర్తిచేస్తామని కేంద్ర ఇచ్చిన హామీలపై ఏవీ ప్రస్తావించకుండా, నిధులపై మాట్లాడిన కేంద్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం రాష్ట్రంలోని ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి ఏటా అభివృద్ధికి నిధులిస్తామని ప్రకటించి ఈ ఏడాది ఆ నిధులను విడుదల చేసి తిరిగి వెనక్కి తీసుకొన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి రైల్వే జోన్, ఇండస్ట్రీయల్ కారిడార్, ఉక్కు కర్మాగారం ఏర్పాటు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో మాట తప్పారని ఆయన గుర్తు చేశారు. నాలుగేళ్లుగా కేంద్రం రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగినా, సొంతంగానే ఆంధ్రప్రదేశ్‌ను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.













