Chandrababu : గతంలో అందుకే నష్టపోయాం : సీఎం చంద్రబాబు
జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) టీడీపీ నేతలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ (TDLP) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా (Viveka) హత్య, కోడికత్తి డ్రామాల నెపం మనమీద వేశారు. అప్పుడు మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం. నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ(Intelligence system) కూడా కుట్రలను పసిగట్టలేకపోయింది. తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది. ఆ ప్రమాదంపై సీసీటీవీ పుటేజ్ కోరినా ఇవ్వలేదు అని అన్నారు.













