ఈ నెల 24 నుంచి విశాఖలో భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తోంది. సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్షించారు. ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రులు, సురేష్ ప్రభు, ఎంజేఅక్బర్, నితిన్ గడ్కరీ, అశోక్ గజపతిరాజు, ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్థన్, రవిశంకర్ ప్రసాద్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ అజయ్ కుమార్, నీతిఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ హాజరుకానున్నారు. బంగ్లాదేశ్, కెనడా, జపాన్, జోర్డాన్, మయన్మార్, మారిషస్, మొరాకో, సింగపూర్, శ్రీలంక, టాంజానియా, థాయిలాండ్, యుఎఇ, జాంబియా దేశాలకు చెందిన మంత్రులతో పాటు 36 దేశాలకు చెందిన పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.













