టీటీడీ ఆధ్వర్యంలో .. కుప్పంలో
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హిందూ ధర్మ ప్రచార పరిషత్ (Hindu Dharma Prachar Parishad) ఆధ్వర్యంలో ఈ నెల 20న కుప్పం (Kuppam)లో శ్రీ మహాలక్ష్మి దీప పూజ (Sri Mahalakshmi Deepa Puja) నిర్వహించనున్నారు. విజలాపురం రోడ్ కుప్పం చెరువు కట్ట దగ్గర నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 15 వేల మంది మహిళలు (Women) పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ క్రతువు కొనసాగనుంది. మంగళ ధ్వనితో ప్రారంభమై, అమ్మవారి గోవిందనామాలతో శ్రీమహాలక్ష్మి దీప పూజ కార్యక్రమం సమాప్తమవుతుంది.








