విద్యార్థినికి లాప్ టాప్ అందజేసిన చేతన ఫౌండేషన్
విజయవాడ నగరానికి చెందిన విద్యార్థినికి చేతన ఫౌండేషన్ సహకారంతో లాప్ టాప్ కంప్యూటర్ అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు తరగతులకు హాజరు అవలేక పలు ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా సిహెచ్ సాయి జాహ్నవి అనే విద్యార్థినికి ల్యాప్ టాప్ అందజేస్తున్నట్లు. ప్రతిభ గల విద్యార్ధినీ, విద్యార్దుల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టటం జరిగిందని చేతన ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవి వెనిగళ్ల, రామ్ చౌదరి ఉప్పుటూరి తెలిపారు.













