వైఎస్ జగన్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్కు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ పంపారు. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు అభినందనలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం లక్ష్యంగా కృషి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మా నిర్మాణాత్మక సహకారాన్ని అందజేస్తాం. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతునానను అని చంద్రబాబు పేర్కొన్నారు.













