విజేతలందరికీ అభినందనలు : చంద్రబాబు
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా హర్షాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విడుదలైన నోటిఫికేషన్ ద్వారా 2,623 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవ్వడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో కానిస్టేబుళ్ల పాత్ర గణనీయమైనదన్నారు. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించాలని అభిలషించారు. ఉత్తమ ర్యాంర్లుగా నిలిచిన మాడెం లక్ష్మీ ప్రియాంక, జింకా శశికుమార్, చల్లా సత్యనారాయణ, సిద్ధారెడ్డి, చెన్నారెడ్డి, వడ్డపల్లి కోటేశ్వరరావుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎంపికైన వారిలో 500 మంది మహిళలు ఉండటం మరింత సంతోషకరవిషయమని అన్నారు.













