11 ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు : ఎంపీల భేటీలో చంద్రబాబు
11రాష్ట్రాలలో ఇచ్చే 6రాయితీలు ఏపికి అడిగాం. జిఎస్ టిలో, ఆదాయపన్నులో రాయితీలు అడిగాం.
కేంద్రం నుంచి స్పందనలేదు.
రాజధాని అమరావతిలో రూ.1,09,023కోట్ల విలువైన పనులు. రాజధానికి కేవలం రూ.1,500కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, గుంటూరు డ్రైనేజికి రూ.1,000కోట్లు అన్నారు.
తొలిదశ కింద రూ.62,623కోట్ల పనులకు డిపిఆర్ ఇచ్చాం. నిధులు అనేకసార్లు అడిగినా ఫలితం లేదు.
రూ.48,115కోట్ల విలువైన 56 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.
రూ.26,600కోట్ల విలువైన 32ప్రాజెక్టుల పనులు పురోగతిలో.
రూ.10,167కోట్ల విలువైన 6 ప్రాజెక్టుల పనులు టెండర్ దశలో.
రూ.11,352కోట్ల ప్రాజెక్టులు ప్రీ-టెండర్ దశలో ఉన్నాయి.
రాజధానికి ఇస్తామన్న మరో రూ.1,000కోట్ల అతీగతీ లేదు.
యూసిలు రూ.1,632.48కోట్ల పనులకు ఇచ్చాం.
ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారు. ఎంపీల భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఒత్తిడి చేయాలి.
దాడుల ద్వారా ప్రత్యర్ధులను భయపెట్టాలనే కుతంత్రం.
హర్యానా,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎంలపై వేధింపులు.
పాత కేసులు తిరిగి తోడుతున్నారు.
సిబిఐ దాడులు, ఈడి సోదాలతో వేధింపులు
ఈవిఎంలపై కూడా కేంద్రం స్పందించడం లేదు.
హర్యానా మాజీ సీఎం హుడా, అఖిలేష్ యాదవ్ పై కేసులు,సోదాలు చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతలపై సోదాలపై ఆర్ధిక మంత్రి హెచ్చరికలపై చర్చ. లండన్ నుంచి అరుణ్ జైట్లీ స్పందనపై చర్చ.
ఇన్వెస్టిగేటివ్ అడ్వెంచరిజమ్ దుష్పలితాలపై జైట్లీ ఆందోళన. మీడియాకు లీకులపై ఆర్ధిక మంత్రి జైట్లీ ఆందోళన.
చివరికి వేధింపులు, అప్రదిష్టే మిగులుతాయన్న జైట్లీ. అమాయకులను వేధించడంపై జైట్లీ స్పందన.
టిడిపిపి సమావేశంలో ఆర్ధికమంత్రి జైట్లీ వ్యాఖ్యలపై చర్చ.
నాలుగున్నరేళ్లలో పోలవరంపై రూ.10,449కోట్లు ఖర్చు: ముఖ్యమంత్రి చంద్రబాబు
అందులో రూ.6727.26కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.3,722కోట్లు రీయింబర్స్ చేయాలి.
4నెలలుగా పోలవరానికి బిల్లులు చెల్లించలేదు.
రూ.57,940కోట్లకు డిపిఆర్-2 పంపాం. డిపిఆర్ 2 పై కేంద్రంలో స్పందనలేదు.
ఈవిఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.
హాజరైన టిడిపి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు
పార్లమెంట్ సమావేశాలు 10 రోజులు జరుగుతుంది. సమావేశాల్లో వ్యూహంపై చర్చ
ఈవిఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని నిర్ణయం.
ఎన్నికల్లో ప్రజలే భాగస్వాములు: ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజల డిమాండ్లనే రాజకీయ పార్టీలు అడిగేది.
అనేక పార్టీలలో ఈవిఎంలపై వ్యతిరేకత.
అభివృద్ధి చెందిన దేశాలే ఈవిఎంలను వాడటంలేదు.
హాకర్లకు ప్రజాస్వామ్యాన్ని బలిచేయరాదు. ఈవీఎంలలో హ్యాకింగ్ కు 100% అవకాశాలు. టెక్నాలజీని ఎవరైనా దుర్వినియోగం చేయవచ్చు. ప్రోగ్రామ్ రాసినవాడికి దుర్వినియోగం సులభం.
ఎలక్షన్ కమిషనర్ ఒక రిఫరీ మాత్రమే.
నమ్మకం లేని విధానంపై ఒత్తిడి చేయరాదు.
ప్రజల్లో విశ్వాసం పెంచడమే ప్రజాస్వామ్యం.
వీవీ ప్యాట్ రశీదులు 100% ఇచ్చేలా చేయాలి.
లేదా పాత బ్యాలెట్ విధానానికే వెళ్లాలి.













