5వేల కోట్లు పంపించండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే రూ.5వేల కోట్ల నగదు పంపించాలని కేంద్రాన్ని, రిజర్వు బ్యాంకును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సరిపడా నగదు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే 80శాతం ఏటీఎంలు మూతపడ్డాయని, మళ్లీ నోట్లరద్దు నాటి పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటీఎంలలో డబ్బుల్లేకపోవడం, బ్యాంకులకు వెళ్లినా అడిగిన మొత్తంలో పదోవంతే ఇస్తుండటం, ప్రజలు పడుతున్న అవస్థలపై అందరికి తెలిసిందే. ఇక్కడి సమస్యలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వుబ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పాటు ఆర్బీఐ ప్రాంతీయ గవర్నర్ సుబ్రమణ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాశారు. పెద్ద, చిన్న నోట్లు కలిపి రూ.5వేల కోట్లు పంపించాలని కోరారు.













