పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా సోమవారం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులతో సమీక్షించారు. ట్రాన్స్ ట్రాయ్‌కు ఇచ్చిన నోటీసులను చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే సుస్థిరమైన సమగ్రాభివృద్ధికి నాంది పలుకుతుందని అన్నారు. ఇప్పటి వరకు 70 శాతం మట్టి పనులు పూర్తి అయ్యాయని, 2.70 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయని సీఎం తెలిపారు. పోలవరం స్పిల్‌వే, కాంక్రీట్ వర్క్, మట్టి పనుల కోసం… నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. డయాఫ్రంవాల్, కాఫర్‌డ్యాం, ప్రధాన డ్యాం పనులకు సంబంధించి… వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కొవ్వూరు నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు…నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా సుమారు రూ. 40 వేల కోట్లు అవసరమౌతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై తాము రూ. 12,500 కోట్లు వ్యయం చేశామన్నారు. నిర్మాణా నికి రూ. 7,500 కోట్లు, పునరావాస ప్యాకేజీకి 5వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. దీనికి జాతీయ హోదా లభించడం తో నిర్థిష్ట సమయంలో పూర్తి చేయగలిగే వీలేర్పడిందన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ. 3,350 కోట్లు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం అందా యన్నారు. మరో రూ. 3,850 కోట్లు త్వరలో విడుదల కానున్నాయన్నారు. 2018నాటికి ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని సరఫరా చేయడమే తమ ధ్యేయం గా పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన పోలవరం నిర్మాణ పనుల్ని స్వయంగా పరిశీ లించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి అధికారుల్తో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. అలాగే పునరావాస బాధితులనుద్దేశిం చి ప్రసంగించారు. వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఇందుకవస రమైన సాధనా సంపత్తిని సమకూర్చుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రాజెక్టు కు నిధుల విషయంలో ఎలాంటి లోటులేదన్నారు. సర్దార్ సరోవర్ నర్మాద ప్రాజెక్ట్ తర్వాత జాతీయస్థాయిలో పోలవరమే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్‌గా చెప్పారు. ఇప్పటికే దీనికనుసంధానంగా నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీటిని మళ్ళించగలిగా మన్నారు. తద్వారా ఆ డెల్టా పరిధిలో నీటికొరతున్నప్పటికీ పంటల్ని పరిరక్షించుకోగలి గామన్నారు. ఈ ఏడాది జూన్ 1వ తేదీనే ఖరీఫ్‌కు నీటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తద్వారా నవంబర్‌లో తరచూ సంభవించే తుపాన్లు, వరదల బారిన పంటపడ కుండా దిగుబడిని సంరక్షించగలిగే అవకాశం ఏర్పడిందన్నారు.
త్వరలోనే హైడల్ ప్రాజెక్ట్‌కు టెండర్లు
పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్న 960మెగావాట్ల సామర్థ్యంగల జల విద్యుత్ కేంద్రానికి త్వరలోనే టెండర్లు ఆహ్వా నించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు. రాబోయే వందరోజుల్లో 28సేద్యపు నీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. వీటిని 13వేల కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు.
18సార్లు ప్రత్యక్ష పర్యవేక్షణ
పోలవరం నిర్మాణం పూర్తయ్యేవరకు తాను విశ్రమించేదిలేదని చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతిలో కూర్చునే పోల వరం నిర్మాణ ప్రగతిని వర్చువల్ ఇన్స్పెక్షన్ విధానంలో 53సార్లు పరిశీలించానన్నారు. కాగా 18సార్లు స్వయంగా ఇక్కడికొచ్చి ప్రత్యక్షంగా పనుల్ని సమీక్షించానన్నారు. ఇప్పటికే డ్యామ్‌కు సంబంధించిన 40గేట్లు సిద్దమయ్యాయని చెప్పారు. అక్టోబర్‌లో ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలెడతా మన్నారు. ఆ సమయంలో కాపర్ డ్యామ్ ద్వారా నీటిని మళ్ళిస్తామన్నారు. ఈసందర్భంగా గేట్ల తయారీ పనులకు చంద్రబాబు పూజలు నిర్వహించి ప్రారభించారు. యుద్ధ ప్రాతిపదికన గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు.
పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత
ప్రాజెక్ట్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో పూర్తిపార దర్శకత పాటించాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ప్రాజెక్ట్ కారణంగా భూమి, ఇళ్ళు కోల్పోయిన వారిలో వేలాదిమంది గిరిజనులున్నారన్నారు. వారికెట్టి పరిస్థితుల్లో అన్యాయం జరక్కూ డదన్నారు. ఇందుకోసం మార్గదర్శకాల్ని అధ్యయనం చేసి అనుసరించాలని సూచించారు. సంబంధిత చెల్లింపుల వివరాలన్నిం టిని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈవిషయంలో ఏ ఒక్క చిన్న విమర్శకు కూడా తావుండకూడదని సూచించారు. నిర్వాసిత కాలనీల్లో తాగునీటితో సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించా లని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
పనులతీరుపై సంతృప్తి
గతరెండు మాసాల్తో పోలిస్తే సెప్టెంబర్‌లో పనుల వేగం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. డీజిల్ లేదు.. కార్మికుల సమ్మె.. వర్షా లంటూ సాకులుచెప్పి పనుల్లో వెనుకంజేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న సమ స్యల్ని స్థానికంగానే సమన్వయం చేసుకోవాల న్నారు. పనుల తీరులో ప్రగతి లేని పక్షంలో సంబం ధిత అధికారుల్ని అసమర్థులుగా పరిగణిస్తామ న్నారు. అలాగే పనులు పూర్తి చేయడంలో నిర్మాణ ఏజెన్సీలకు లక్ష్యాలు నిర్ధేశించి ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. డ్యామ్‌కు సంబం ధించి ముఖ్యమైన ఇసిఆర్ఎఫ్ డ్యామ్‌ను నవంబర్‌లో, స్పిల్‌వేకు సంబంధించిన 48రేడియల్ గేట్స్ స్కిన్ప్లేట్స్ను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కాంక్రీట్ లైనింగ్, ఐకానిక్ బ్రిడ్జి పనులకు సర్వం సిద్దం చేయాలన్నారు. కాపర్‌డ్యామ్‌కు సంబంధిం చి అప్స్క్రీన్ సైడ్ 2.1 కిలోమీటర్స్, డౌన్ స్ట్రీమ్సైడ్ 1.2కిలోమీటర్లు పనుల్లో పురోగతి సాధించాలన్నారు. ఎర్త్వర్క్కు సంబంధించిన 71శాతం పూర్తయిం దన్నారు. డయాఫ్రమ్ వాల్ 500మీటర్లు పూర్తికాగా మిగిలిన 1200 మీటర్లు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇన్వెస్టిగేషన్, డిజైన్ల పరిస్థితిపై కూడా సీఎం సమీక్షించారు. సంబంధించిన అనుమతుల కోసం సిడ బ్ల్యుసి అధికారుల్తో మాట్లాడ తానన్నారు. కేంద్రం నుండి నిధుల రాకలో జాప్యం జరిగినా ముందుగా పనులు పూర్తిచేయాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ పనుల వద్దనున్న నాలుగు కెమెరాలకదనంగా 20కెమెరాలేర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటన్నింటినీ ఆనుసంధానిస్తూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల న్నారు. తద్వారా ఎవరొచ్చినా పనుల తీరు పరిశీల నకు అవకాశముం టుందన్నారు.













