Chandrababu: 2026 అక్టోబరు నాటికి పోలవరం పూర్తి : చంద్రబాబు
పోలవరం (Polavaram) ప్రాజెక్టును 2026 అక్టోబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ (Diaphragm wall) పూర్తి కావాలని అధికారులకు చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వద్ద సీఎం చంద్రబాబు (Chandrababu) సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న చంద్రబాబు, వస్తూనే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu), ఇతర అధికారులతో కలిసి వ్యూపాయింట్‌కు వెళ్లారు. పోలవరం గ్యాప్1 పనులను పరిశీలించి, ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి, అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి, పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్‌ను ప్రకటించారు.













