నర్మద తరువాత పోలవరమే : చంద్రబాబు
దేశంలో నర్మద ప్రాజెక్టు తరువాత జాతికి అంకితం చేసే ప్రాజెక్టు పోలవరమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రుల జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు రూపు సంతరించుకుందని అన్నారు. నవంబర్లో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గోదావరి వరద తగ్గాక కాఫర్ డ్యామ్, డయా ఫ్రం వాల్ పనులు ప్రాంరభిస్తామన్నారు. స్పిల్ చానల్ మీదుగా డ్యామ్ వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. రాజకీయాల కోసం పోలవరం పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు నష్టం కలగకుండా పరిహారం ఇప్పిస్తామని అన్నారు. రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి నివేదిక ఇచ్చామని కేంద్రం నుంచి రూ.3,850 కోట్లు రావాలని ఆయన వెల్లడించారు.













