ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి : చంద్రబాబు
ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎంపీలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని అన్నారు. 28 మంది వైసీపీ ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నించారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్లుగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢల్లీి పర్యటన ఎవరి కోసం అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కొత్త జిల్లాల డ్రామాను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు.













