పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలు : చంద్రబాబు
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుబడుల కోసమే విదేశాలకు వెళ్లామని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని అన్నారు. 5 లక్షల మందికి ఉపాధి దొరికిందని చెప్పారు. విదేశీ పర్యటనల్లో రూ.16 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు. ప్రధాని మోదీ కూడా చాలా దేశాల్లో పర్యటించారన్నారు. 39 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించడం సరికాదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీని నెంబర్ వన్ స్థానానికి చేర్చామని తెలిపారు. రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డామని సృష్టం చేశారు. మీరు కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయండి కానీ, వృథా ఖర్చు అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. తనను విమర్శించేముందు రాష్ట్రాభివృద్ధి కోసం మీరు చేస్తారో చెప్పండని అధికార పక్షాన్ని నిలదీశారు.













