రాష్ట్ర ప్రభుత్వం వల్లే ఈ సమస్య : చంద్రబాబు
పోలవరం పనులు చేస్తున్న ఏజెన్సీని మర్చొద్దని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య ఎదురైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రివర్స్ టెండర్ల విధానంతో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ నిర్వహణ వైఫల్యమే ప్రధాన కారణం అన్నారు. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి నూటికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులపై అధికార పార్టీ నేతలు దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణ్పై దాడి చేయడం దారుణం అన్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు అధికారులపై దాడులు చేస్తుంటే సీఎం మౌనంగా ఉండటం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.













