కుప్పాన్ని మరో పులివెందులగా మారుస్తారా?
కుప్పంలో తాము గెలవకపోవడం కాదని, ప్రజాస్వామ్యం ఓడిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. డబ్బు పంపిణీతో పాటు అరాచకాలపై ఆదారాలు పంపినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్రమాలు అడ్డుకోలేని ఎన్నికల కమిషన్ ఎందుకని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు తమతో మైండ్ గేమ్ ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపాకు ఓటేయని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ శాతం టీడీపీ మద్దతుదారులే గెలిచారన్నారు. కుప్పంలో కోట్ల రూపాయల డబ్బులు పంచారు. కుప్పంతో నాకు 35 ఏళ్ల అనుభవం ఉంది. అక్కడి ప్రజలు నన్ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు. శాంతికి మారుపేరు కుప్పం. అలాంటి శాంతియుత ప్రాంతాన్ని కలుషితం చేస్తారా? కుప్పాన్ని మరో పులివెందులుగా మారుస్తారా? అని ప్రశ్నించారు.













