దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

దసరా శరన్నవరాత్రుల్లో ఏడో రోజు మూలా నక్షత్ర శుభ ముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సతీసమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కూడా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇంకా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు కూడా పాల్గొన్నారు. వేదపండితులు వారికి ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు.