సింగపూర్ పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు
ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులు సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సదస్సులో కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొనటంతో పాటు, పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేస్తున్నందున వీటన్నింటికీ దోహదపడేలా ఈ పర్యటనకు రూపకల్పన చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సీఆర్డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారులు ఉంటారు.













