పోలవరం నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే క్రస్టు గేట్లు బిగించే ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 40, 41 స్తంభాల మధ్య తొలి క్రస్ట్ గేట్ వద్ద పూజలు చేసి ఈ ప్రక్రియకు మ్యుమంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎగువ కాఫర్ డ్యామ్ పనులను పరిశీలించనున్నారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించాం : మంత్రి దేవినేని
7 ముంపు మండలాలు మన భూభాగంలోకి కలపడం వల్లే సాధ్యమైంది – ముంపు మండలాలు తీసుకోవడం వల్లే ప్రాజెక్టు కల సాకారమవుతోంది – పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎన్నో కుట్రలు చేశారు – ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పించాం – 2016 డిసెంబర్లో మొదటి పిల్లర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు – మళ్లీ ఇవాళ మొదటి గేటు బిగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు : మంత్రి దేవినేని













