ఆక్రమ కేసులు పెట్టిన.. పైశాచిక ఆనందం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతల్ని వేధిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పోందుతున్నారని ఆరోపించారు. పెట్రో ధరలపై ఆందోళన చేస్తే చింతమనేని అరెస్టు చేశారన్నారు. ఉపాధి బిల్లలు చెల్లించకుండా వేధిస్తున్నారని విమర్శించారు. తిరగబడితే ప్రభుత్వం తోకముడుస్తుందని అన్నారు. ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారన్నారు. తెలుదేశం పార్టీ నేతల ఫోన్లు లాక్కుంటున్నారని మండిపడ్డారు.













