నేను వెళ్లి అడుక్కోవాలా? ఆయనకు తెలియదా?
కేంద్ర ఎన్నికల సంఘంపైనా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌లు వెళ్లి ముఖ్యమంత్రికి పరిస్థితులు వివరిస్తుంటే… మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎందుకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ నేను వెళ్లి అడ్కుకోవాలా? ఆయనకు తెలియదా? చదువుకోలేదా? రాజ్యంగంలో ఎవరి పరిధులేంటో? ఎన్నికల విధులేంటో, ఎన్నికేతర పాలనా విధులేంటో తెలియవా? అని మండిపడ్డారు. వచ్చేవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించి పరిస్థితులు సమీక్షిస్తామని, అధికారుల్లో ఎవరు బిజినెస్ రూల్స్‌ని, ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.













