టీడీపీ పసుపు-కుంకుమ పెడితే…వైసీపీ పసుపు-కుంకుమని చెరిపేసే పరిస్థితి
గుంటూరులో ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ అభివృద్ధి చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో అమరావతి అభివృద్ధి చేస్తే అంతకంటే బ్రహ్మాండంగా గుంటూరు అభివృద్ధి చెందుతుంది. గుంటూరులో శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని కొన్ని దేశాలనే పాలించారు. రాజధానికి ఏ పేరు పెట్టాలని చాలామందిని అడిగితే.. రకరకాల పేర్లు చెప్పారు. రామోజీరావు చెప్పిన అమరావతి పేరు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. చైనా, జపాన్‌లోని వ్యక్తులు బౌద్ధమతం అమరావతి నుంచి వచ్చిందని చెప్తే.. నాకు సంతోషమేసింది. జిల్లాలోని కొంతమంది నాయకులు ప్రాముఖ్యత సాధించారు.
జిల్లాలో ఉన్న టీడీపీకి అన్ని సీట్లు గెలిపించాలి. 3 పార్లమెంట్ సీట్లు గెలిపించాలి. ఈ రోజు మీరు చూపించే అభిమానం ఉత్సాహం 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. టీడీపీకి 65 లక్షల మంది సైనికులున్నారు. ఎన్నికల యుద్ధం అంటే మాకు భయం లేదు. కోటి మంది చెల్లెమ్మలున్న డ్వాక్రా సంఘానికి ఒకే ఒక అన్న నేను – వారికి పసుపు-కుంకుమ 2 విడతలు ఇచ్చాం. రూ. 67 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం – దాదాపు రూ.లక్ష కోట్లు కోటి మంది చెల్లెమ్మలకు ఇచ్చిన ఘనత నాదే. గతంలో కరెంట్ లేకపోతే.. ఇప్పుడు మిగులు కరెంట్ సాధించాం. కరెంట్ కొరతని అధిగమించాం. మరుగుదొడ్లు కట్టించాం. వంట గ్యాస్ ఇచ్చాం. ఆస్తులన్నీ ఆడబిడ్డల పేరుతో ఇచ్చాం.
ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం ఆడవాళ్లకి టీడీపీ రిజర్వేషన్ కల్పించింది. పసుపు-కుంకుమ నిరంతరం మహిళలకు అందాలంటే టీడీపీ రావాలి. టీడీపీ పసుపు-కుంకుమ పెడితే…వైసీపీ పసుపు-కుంకుమని చెరిపేసే పరిస్థితికి వస్తున్నారు. ముసలివాళ్లు సైతం టీడీపీకి సహకరిస్తున్నారు. 55 లక్షల వృద్ధులు, వితంతవులు, దివ్యాంగులకు పింఛను ఇస్తున్నాను. చేతులు లేకపోతే.. రూ. 10 వేలు ఇచ్చిన ప్రభుత్వం టీడీపీ. గౌరవప్రదమైన జీవితాన్ని కల్పిస్తున్నాం -– టీడీపీకి ఓటేయాలని చెప్పే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. ముసలివాళ్లని ఎక్కువ సేపు ప్రచారానికి తిప్పవద్దు.. వారి ఆరోగ్యం దెబ్బతింటుంది – వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది – పంటలు ఎండిపోయాయి – ఆ సమయంలో రూ. 24,500 కోట్ల రుణమాఫీ చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం – రూ. లక్షా 50 వేలు సన్న,చిన్నకారు రైతుల రుణమాఫీ చేశాం – అన్నదాతా సుఖీభవ తీసుకొచ్చాం.
కేంద్రం 2 హెక్టార్లకి రూ. 6 వేలు ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు – నేను 2 హెక్టార్లకి రూ.10 వేలు ఇస్తున్నాం – కౌలు రైతులకి రుణాలు ఇప్పిస్తున్నాం – పెట్టుబడిని ఇప్పిస్తాం – ఏ పంటకు కష్టం వచ్చినా.. కేంద్ర సహకరించపోయినా.. ఎమ్మెస్పీ ఇచ్చిన ఘనత టీడీపీది – మొట్టమొదటగా వెహికల్స్ టాక్స్ రద్దు చేశాం – థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ మనమే కడతాం – సాధికార సంస్థ పెట్టాం – 15 లక్షల డ్రైవర్ల బాధ్యత నాది – మీ ఆటోలో రోజుకు దాదాపు 100 మంది ఎక్కుతారు – ఎక్కడంతోనే.. చర్చ ప్రారంభించాలి.. ప్రభుత్వం గురించి చెప్పాలి.. మనకు పాజిటివ్‌గా ఉంటే.. టీడీపీ గురించి చెప్పాలి.. మనకి ఓటు వేయాలా వద్దా అని సందేహిస్తుంటే.. టీడీపీ సంక్షేమాలని తెలియపరచాలి – నేను రాష్ట్రంలో డ్రైవర్ నెంబర్1 – తల్లిదండ్రులు వదిలేస్తే.. వారిని చూసుకునే బాధ్యత నాకుంది – 5 లక్షల మంది నిరుద్యోగులకి ఖర్చులకు 2 వేలు ఇస్తున్నాం – ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటాం – రూ. 15 లక్షల కోట్ల విలువ చేసే ఎంవోయూలు చేశాం – 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి – ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మనమే నెంబర్ 1 – నీళ్లు ఇస్తున్నాం, భూమి ఉంది, రోడ్లు బాగున్నాయి, పోర్టు, ఎయిర్‌పోర్టు ఉన్నాయి – ప్రభుత్వం నీతివంతమైనదైతే.. పెట్టుబడులు పెడతారు – వైసీపీ వాళ్లు వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు – మేము కూడా పెట్టుబడులు పెడతామని కొంతమంది నాకు చెప్పారు.. మధ్యలో పార్టీ మారితే మా పరిస్థితి ఏంటని అడిగారు.. పార్టీ మారే పరిస్థితి లేదని తెలిపాను : సీఎం చంద్రబాబు నాయుడు.













