నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం
సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్లు వేస్తాడట, నువ్వే మా నమ్మకం కాదు నువ్వే మా దరిద్రం అని ప్రజలు అంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఇదే ఖమ్మం మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ వేస్తాడట అని ఎద్దేవా చేశారు. సైకో జగన్ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్రెడ్డి ఇచ్చే పది రూపాయలు మాత్రమే కనిపిస్తోంది కానీ, దోచుకునే రూ.50 గురించి తెలుసుకుంటే వైసీపీ నేతల్ని మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్నారు. ఏమారితే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. జగన్రెడ్డి విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.













