పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు…టీడీపీ అభ్యర్థులు ఖరారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. పశ్చిమ రాయలసీమకు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, తూర్పు రాయలసీమకు కంచర్ల శ్రీకాంత్‌లను ప్రకటించింది. విశాఖపట్నంకు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇకపై ఏ ఎన్నిక జరిగినా టీడీపీ పోటీ అనివార్యమని గెలుపే ధ్యేయంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని, లేకుంటా వైసీపీ నేతలు దొంగ ఓట్లను చేరుస్తారని ఆరోపించారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఇన్ఛార్జ్ తమ నియోజవకర్గంలోనే ఉండాలని, పరిశీలకులు నెలలో 8 రోజులు అక్కడే ఉండేలా చూసుకోవాలని సూచించారు. టీడీపీపై విష ప్రచారం చేసే కొన్ని మీడియా సంస్థల కుట్రలను తిప్పికొట్టాలంటే టీడీపీ సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం కావాలన్నారు.













