ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి చంద్రబాబు లేఖ..
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ సేవలను నిలిపివేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది.. ప్రస్తుతం ఈ విషయం పై పెద్ద రచ్చ జరుగుతుంది. వాలంటీర్లు నగదు పంపిణీ చేయకూడదని.. వారికి ప్రభుత్వం అందజేసిన ట్యాబులు, మొబైల్ ఫోన్లు కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పెన్షనర్లకు నగదు అందించే విషయంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కోడ్ పూర్తయ్యే వరకు ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం కుదరదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు సెక్రటేరియట్ స్టాఫ్ సచివాలయం దగ్గర నగదు పంపిణీ చేయాలని.. పెన్షన్ తీసుకోవడం కోసం వచ్చే వ్యక్తులు తమతో పాటు ఆధార్ కార్డు లేక ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావాలని ఆదివారం విడుదల చేసిన సర్కులర్లో ప్రభుత్వం పేర్కొంది.అయితే దీనిపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందరికీ వచ్చి తీసుకోవడం కష్టమవుతుందని.. ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ సిబ్బందిని ఉపయోగించి ఇళ్ల వద్దకే పెన్షన్ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైయస్ షర్మిల కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఇదే విషయంపై లేఖ రాశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.













