కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరోసారి స్పష్టత
విభజన సమస్యలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. విభజన చట్టంలోని వివిధ అంశాలపై టీడీపీ ఎంపీలు రామ్మోహన్నాయుడు, కేశినేని నాని లోక్సభలో అడిగిన వివిధ ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని వెల్లడించారు. రూ.106 కోట్లతో సౌత్ కోస్ట్ రైల్వేజోన్ కార్యాలయం నిర్మిస్తామని, ఇందుకోసం 2023-24లో రూ.10 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదన్నారు. సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచారణ సాధ్యం కాలేదన్నారు. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిందన్నారు.













