అంతర్వేది ఘటన సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని రథం ఎలా అగ్నికి ఆహుతైందన్న అంశంపై ప్రత్యేక విచారణకు సీఎం జగన్ ఆదేశించారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ పంపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు విచారణ చేపడుతున్నా కొన్ని రాజకీయ పార్టీలు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది.













