అయేషా కేసులో సీబీఐ కీలక నిర్ణయం
అయేషా మీరా హత్య కేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయేషా మీరా కేసును దర్యాప్తు చేసిన అప్పటి పోలీసులను ప్రశ్నించాలనే ఆలోచనలో సీబీఐ ఉంది. కేసులో తనను పోలీసులు కావాలని ఇరికించారని ఇప్పటికే కేసులో శిక్ష పడి విడుదలైన సత్యంబాబు ఆరోపనలు చేసాడు. ఇక హత్య జరిగి 11 ఏళ్ళు గడవటం, కేసులో సాక్ష్యాలు ధ్వసం కావటంతో అప్పటి పోలీసులు దర్యాప్తు కోసం ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇప్పటికే 15 మందితో కూడిన పోలీస్ అధికారుల జాబితాను సిద్ధం చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసుల నుంచి వచ్చే వివరాలు కేసు పురోగతికి పనికి వస్తాయని సీబీఐ భావిస్తోంది.













