జనసేన అభ్యర్థిగా అవనిగడ్డ నుంచి బరిలోకి దిగుతున్న టిడిపి సీనియర్ నేత..
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఏపీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఈరోజు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సమక్షంలోని బుద్ధ ప్రసాద్ జనసేన కండువా కప్పుకోబోతున్నారు. అంతేకాదు జనసేన కోటాలో ఆయనకు అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు వెళ్లడంతో నియోజకవర్గం పై మంచి పట్టు ఉన్న బుద్ధ ప్రసాద్ ను ఆ స్థానం నుంచి దింపడానికి జనసేన అధిష్టానం నిర్ణయించుకుంది. 1999, 2004, 2014 ఎన్నికలలో అవనిగడ్డ నుంచి బుద్ధ ప్రసాద్ ఎన్నికయ్యారు. దీంతో ఈసారి అవనిగడ్డ బుద్ధ ప్రసాద్ కి ఇవ్వడం ద్వారా గెలుపు ఖాయమని పవన్ భావిస్తున్నారు. మొత్తానికి కూటమిలో భాగంగా వచ్చిన అన్ని టికెట్లు గెలవాలి అని పవన్ గట్టి ప్రణాళికే వేస్తున్నట్లు కనిపిస్తోంది.













