అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు : సుజనా
అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. కేంద్రం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదని, 13 జిల్లాల ప్రజల రాజధాని అని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదన్నారు. అమరావతి ఉద్యమానికి బీజేపీ మద్దతు ఉంటుందని, అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమవుతుందని అన్నారు.













