చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ రియాక్షన్
టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఈ సమావేశంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ కలిస్తే అసలు బీజేపీకి దాంతో ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. ‘సమావేశంలో ఏం మాట్లాడారో చంద్రబాబు లేదంటే ప్రశాంత్ కిశోర్ చెప్పాలి. దీనిపై బీజేపీ ఏం చెప్తుంది? మేం స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మేం కేవలం మా పార్టీ వ్యవహారాలను మాత్రమే పట్టించుకుంటాం. కానీ కొన్ని పార్టీలు దీంతో మమ్మల్ని ముడిపెట్టడం వారిలో భయాన్ని చూపిస్తోంది. ఎన్నికల్లో మేం ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశాన్ని మా పార్టీ అధినాయకత్వమే నిర్ణయిస్తుంది. మిగతా పార్టీలు దీనిపై ఆందోళన చెందకపోతే బాగుంటుంది’ అంటూ ఆయన విమర్శించారు.













