ప్రధాని మోదీకి సీఎం రమేశ్ ఆహ్వానం
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ తన కుమారుడు రిత్విక్ వివాహానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రిని కలిశారు. ఫిబ్రవరి 7న రిత్విక్ వివాహం జరగనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజాతో నిశ్చితార్థం కొద్ది రోజుల కింద దుబాయ్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ఎంపీలు, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా హాజరయ్యరు. ఇందుకోసం సీఎం రమేశ్ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిశ్చితార్థం కంటే వివాహాన్ని మరింత ఖర్చుతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ప్రధాన మంత్రి సహా జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తతలు హాజరయ్యేందుకు వీలుగా ఢిల్లీలోనూ వివాహ విందు ఏర్పాటు చేశారని సమాచారం.













