హరిబాబుకు పెద్ద పదవి!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఆకస్మిక రాజీనామాలో, కొత్త సారథి ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, కాపు సామాజికవర్గ నేతకే అధ్యక్ష పదవి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. ఏపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించినందునే హరిబాబుతో రాజీనామా చేయించామని వెల్లడించారు. ఇంకోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసిహారావు మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో ఏపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు. మరింత ఉన్నత పదవి ఇచ్చేందుకే హరిబాబుతో రాజీనామా చేయించినట్లు చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇస్తామని సృష్టం చేశారు.













