వైకాపాకు ఓటేస్తే సంఖ్య పెరుగుతుంది తప్ప… అభివృద్ధి ఉండదు
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైకాపాకు ఓటేస్తే సంఖ్య పెరుగుతుంది తప్ప, అభివృద్ధి ఉండదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. కపిలతీర్థంలో బీజేపీ-జనసేన సంయుక్తంగా ప్రచారం నిర్వహించాయి. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ తిరుపతిలో అన్యమత ప్రచారాలు, అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామన్నారు. సాంకేతికత ఉన్నా విగ్రహాలు ధ్వంసం చేసే వారిని పట్టుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి మతప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. రాజకీయ రణరంగం నుంచి టీడీపీ పక్కకు తప్పుకుందని, రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు.













