పై డేటా సెంటర్‌ను సందర్శించిన ఆస్ట్రేలియా హై కమిషనర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ ఐటీ పార్కులోని పై డేటా సెంటర్‌ను ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించింది. ఈ డేటా సెంటర్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని హైకమిషనర్ గ్రీన్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా పెన్షన్ నిధులను 2017లో ఈ డేటా సెంటర్లో పెట్టుబడిగా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఎదురు చూస్తున్నామని అన్నారు. డేటా సెంటర్ నెలకొల్పి గొప్ప సౌకర్యాల్ని కల్పించారని సంస్థ వ్యవస్థాపకుడు కల్యాన్ ముప్పనేని అభినందించారు. ఏపీలో డేటా సెంటర్ ఆర్థికాభివృద్ధికి గల అవకాశాలపై కల్యాణ్‌తో చర్చించారు. గ్రీన్ వెంట చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సూల్ జనరల్ సిలైజకి, వైస్ కాన్సుల్ శామ్యూల్ మైయర్స్, ఢల్లీిలోని ఆస్ట్రేలియా హైకమిషన్ కౌన్సిలర్లు జూలియన్ స్టార్మ్, కిరణ్ కరామిల్, వ్యాపార, పెట్టుబడుల విభాగం విధాన విశ్లేషకులు ఆరుణ్ పీఎస్ తదితరులు ఉన్నారు.













