NCLT: ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్ పిటిషన్పై… తీర్పు రిజర్వు
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఎన్సీఎల్టీ రిజర్వు చేసింది. తన సోదరి షర్మిల (Sharmila), తల్లి విజయమ్మ (Vijayamma) అక్రమంగా షేర్లను బదిలీ చేశారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బదలాయింపును రద్దు చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు ఒప్పందం మేరకే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వు చేసింది.













