మలేసియా బాధితులకు ఏపీఎన్ఆర్టీ బాసట
అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోయి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రాలేక మలేసియాలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన బాధితులకు ఏపీఎన్ఆర్టీ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెండ్ తెలుగు సొసైటీ) అండగా నిలుస్తోంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారికి మలేసియా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించి డిసెంబరు 31లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బాధితుల తరపున ఇమిగ్రేషన్ ఫీజు చెల్లించి, విమాన టికెట్ సమకూర్చి వారిని స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటివరకు ఏపీఎన్ఆర్టీని 217 మంది సంప్రదించగా 44 మందిని రాష్ట్రానికి తీసుకువచ్చింది. ఇంకా ఎవరైనా బాధిఉతుల ఉంటే మలేసియాలోని తమ సమన్వయకర్తల ఫోన్ నంబర్లు +06178807064, +06176196143లకు సంప్రదించాలని ఏపీఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్ తెలిపారు.













