ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌కు కరోనా

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ఎవరు అందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కొవిడ్ పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని శైలజానాథ్ సూచించారు.