ఏపీలో తొలి ‘డెల్టా ప్లస్’ కేసు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. అయితే ఆ వ్యక్తి నుంచి ఇతరులెవ్వరికీ వ్యాప్తి చెందలేదని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ… ఏపీలో తొలి డేల్టా ప్లస్ కేసు నమోదైందని ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఈ కేసు నమోదైందని, అయితే ఏ ఇతర వ్యక్తికీ ఇది సోకలేదని తెలిపారు. మూడో వేవ్ వచ్చినా, తట్టుకునే విధంగా అధికారులు అప్రమత్తతతో ఉండాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్లనానితో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కొన్ని రోజులు కిందటే ఏపీ సర్కారును కేందరం ఈ విషయంలో హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీతో పాటు మరో 7 రాష్ట్రాలు అత్యంత అప్రమత్తతతో ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కరోనా సెకండ్ వేవ్ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఏపీలో డెల్లా ప్లస్ కేసు నమోదు కావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.