ఏపీలో కొత్తగా 10,415 కరోనా కేసులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,413 కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‍ను విడుదల చేసింది. 24 గంటల్లో కరోనాతో 83 మంది మృతి చెందారు. కరోనా నుంచి 15,649 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,33,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,93,921 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,96,19,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.