ఎన్నికల బరిలో క్యాండిడేట్ల కోసం వెతుకులాడుతున్న పార్టీలు..
ఏపీలో మండుతున్న ఎండల కంటే రోజురోజుకి ఎన్నికల వేడి ఎక్కువ అయిపోతుంది. ఒకపక్క ఒంటరి పోరికి వైసిపి రెడీ అయితే.. కూటమితో దాడి చేయడానికి టిడిపి సిద్ధంగా ఉంది. మరోపక్క కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ ప్రధాన పార్టీలు కాకుండా మరో నాలుగు కీలక పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ పార్టీలకు ఇతర ఏ పార్టీలతో పొత్తులు లేవు. కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ, జడ శ్రావణ్..జై భారత్ భీం రావ్ పార్టీ, మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ ..జై భారత్ నేషనల్ పార్టీ లు కోరుకునేది అవుతున్నాయి. వీటితోపాటు మన పొలిటికల్ కమీడియన్ ఆనంద పాల్ ప్రజాశాంతి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం పొత్తుల కారణంగా టిడిపి జనసేనలో టికెట్లు రాక ఇబ్బంది పడుతున్న నేతలు.. వైసీపీలో కొత్త పోకడకు పీఠం వేయడంతో సీనియర్ నేతలు టికెట్లు దక్కక సతమతమవుతున్నారు.. ఇలా అందరూ కూడా ఏదో ఒక పార్టీలలో సీట్లు దక్కించుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాల్ ఒక అడుగు ముందుకు వేసి.. పార్టీలో జిల్లాకు రెండు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.. పోటీ చేయాలి అనుకుంటున్న యువత లేటు చేస్తే టికెట్లు సేల్ అయిపోతాయి అంటూ ప్రచారం చేస్తున్నారు. పార్టీల కోసం క్యాండిడేట్ లు వెతికే పరిస్థితులు మారి క్యాండిడేట్స్ కోసం పార్టీలు దేవులాడే పరిస్థితి కనిపిస్తోంది.













