6,7,8 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి : రఘువీరారెడ్డి
మార్చి 6,7,8 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని ఏపీపీసీసీ రఘువీరారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ మార్చి 2న జాతీయ రహదారుల దిగ్బంధనం, 6,7,8 తేదీల్లో పార్లమెంటు ముట్టడి కార్యక్రమం చేపడతామని రఘువీరారెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… బాబు, మోడీలు ఏపీకి మోసం చేసి ఇప్పుడు నాటకాలాడుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పొందు పరచలేదంటున్నబీజేపీ… నాలుగేళ్లలో పార్లమెంటులో ఒక్క సారి కూడా సవరణ బిల్లు ప్రవేశ పెట్టలేదని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తారని చింతా మోహన్ అన్నారు.













