అమెరికా వర్సిటీలో విద్య.. రూ.కోటి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్ కుమారుడు కృష్ణ కిషోర్ అమెరికాలోని కొలంబియా వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్య అభ్యసించేందుకు ఫీజుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. దీనికి కృతజ్ఞతగా విద్యార్థి కృష్ణ కిషోర్ తన తల్లిదండ్రులతో వచ్చి స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు విదేశీ విద్య అందిస్తోందని తెలిపారు.













