హస్త కళాకారులకు ఎపి ప్రభుత్వం ఆర్థిక సహాయం
‘హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ రెండింటి వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. జిల్లాలలో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి. ఈ కళలు కలకాలం ఉండాలంటే, వాటికి అండగా నిలవడం ఎంతో అవసరం. ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బ్రతుకుతోంది. అలాంటి వృత్తులు బ్రతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.













