ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం. పాఠశాలల్లో ఇకపై
ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఇకపై మొబైల్ వాడకాన్ని నిషేధిస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా తమ వెంట మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి వీల్లేదని కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఉపాధ్యాయులు కూడా క్లాసులోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్ళడానికి వీల్లేదని తెలిపింది. తగరతి గదిలోకి వెళ్లే ముందే ఉపాధ్యాయులు తమ ఫోన్లను హెడ్మాస్టర్కు అప్పగించి వెళ్ళాలని ఆదేశించింది ప్రభుత్వం. బోధన సమయంలో ఎటువంటి ఆటంకం రాకుండా, ఉపాధ్యాయుల తోపాటు విద్యార్థులు తమ పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది విద్యా శాఖ. యునెస్కో ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది పాఠశాల విద్యా శాఖ.













